Konapur | సారంగాపూర్, ఏప్రిల్ 20 : చిన్నారులకు పోషకాలు కలిగిన చిరుధాన్యాలను తప్పకుండా తినిపించాలని గ్రామ సర్పంచ్ ఆకుల రమేష్ సూచించారు. సారంగాపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో ధర్మపురి సెక్టార్ పరిధిలో పోషన్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ సూపర్వైజర్ లత మాట్లాడుతూ చిన్నారులు పుట్టిన నుంచి ఆరు సంవత్సరాల పిల్లల పోషన అభివృద్ధి, శిశువు మెదడు వికాశాన్ని ప్రోత్సహించడం పట్ల తల్లులకు అవగాహన కల్పించారు.
గర్భిణులు తీసుకునే ఆహారం, పోషక పదార్ధాలు ప్రదర్శించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రసన, అక్ష్యరాబ్యాసాలు కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతీ రోజు పిల్లలకు పోషక విలువలు కలిగిన చిరు ధాన్యాలను, ఆహారం తినిపించాలని వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఫ్రీ స్కూల్ విద్యార్థులకు ఈ సందర్భంగా సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుకొవెల కిష్టయ్య, పంచాయతీ కార్యదర్శి నరేష్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.