గోదావరిఖని, నవంబర్ 27 : మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేదా స్థానిక ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ సమాధానం చెప్పాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ సూచించారు. కాంగ్రెస్ నాయకులు స్థాయిని మించి మాట్లాడి, హరీశ్‌రావు దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు గురువారం ఆయన, కాంగ్రెస్ నాయకులపై గోదావరిఖని వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేసి మాట్లాడారు. 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ 7కు ఒక యూనిట్ చొప్పున ప్లాంటు నిర్మిస్తామంటే బయట తమకు 5కే దొరుకుతుందని, ప్లాంటు నిర్మాణానికి ఆరేళ్ల సమయం పడుతుందని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు.
ఇప్పుడు 10 వేల 880 కోట్లతో కేబినెట్లో ఆమోదించారని, ఈ లెక్కన ప్లాంటు నిర్మాణం అంటే ఒక యూనిట్‌కు 8 పడే అవకాశం ఉందని, ఈ విషయంపై మాట్లాడినందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు దిష్టిబొమ్మను స్థానిక కాంగ్రెస్ నాయకులు దహనం చేయడం సరికాదని హితవుపలికారు. వారిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో తాము కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మల దహనానికి ప్రయత్నిస్తే అడ్డుకొని తమపై కేసులు నమోదు చేసిన పోలీసులు, ఇప్పుడు అదే తరహాలో కాంగ్రెస్ నాయకులపైనా కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇక్కడ మాజీ కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, కల్వచర్ల కృష్ణవేణి, బాదె అంజలి, గాధం విజయ, నాయకులు అచ్చెవేణు, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, నారాదాయణ దాసు మారుతి, జక్కుల తిరుపతి, మేడి సదానందం, ముద్దసాని సంధ్యారెడ్డి, తోకల రమేశ్, సట్టు శ్రీనివాస్, బుర్ర శంకర్, వెంకటేశ్, నీరటి శ్రీనివాస్, శ్రావణ్, చింటూ, బాలరాజు పద్మ, రామరాజు ఉన్నారు.