Chandurthi | సబ్‌స్టేషన్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని చార్వాక వృద్ధుల రిలే నిరహార దీక్ష
చార్వాక వృద్ధుల ఆశ్రమ స్థలంలో నిర్మించనున్న సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దప్పుల అశోక్ డిమాండ్ చేశారు. అధికారుల వైఖరికి నిరసనగా మంగళవారం చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్ష చేపట్టారు.
Chandurthi | చందుర్తి, మే19: చార్వాక వృద్ధుల ఆశ్రమ స్థలంలో నిర్మించనున్న సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దప్పుల అశోక్ డిమాండ్ చేశారు. అధికారుల వైఖరికి నిరసనగా మంగళవారం చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధాశ్రమానికి ఎదురుగా సబ్ స్టేషన్ నిర్మించడం వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధికి తాము అడ్డు కాదని, గ్రామపంచాయతీ తీర్మానం చేసిన స్థలంలో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని గుర్తు చేశారు.
20 వేల మంది వృద్ధుల ఆత్మగౌరవానికి ప్రతీక చార్వాక పౌండేషన్ అన్నారు. వృద్ధుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సబ్ స్టేషన్ నిర్మాణాన్ని మార్చాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం పునః పరిశీలించి సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని కోరారు. ఇక్కడ వృద్ధుల సంక్షేమ సంఘం సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

