Rudrangi | రుద్రంగి, జూలై 7: రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగరావు గంగరాజం కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో గుండె సంబంధించిన ఆపరేషన్ చేయించుకొని చికిత్స పొందుతున్నాడు. కాగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు సోమవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా గంగరాజం ఆరోగ్య పరిస్థితిని ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.