Ramagiri | రామగిరి, జనవరి 23 : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారు చైన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ బీ రాంరెడ్డి, ఏసీపీ మడత రమేశ్, మంథని సీఐ బీ రాజు, రామగిరి పీఎస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అరెస్టయిన నిందితులను కో మ్రే ప్రణీత్, షేక్ సఫిద్ది న్ గా గుర్తించినట్లు తెలిపారు. వీరు గత కొంతకాలంగా రామగుండం, పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణలో వీరు పలు కేసుల్లో నిందితులు ఉన్నట్లు చెప్పారు. వారిని అరెస్టు చేసి వీరి నుంచి బంగారు చైన్లు, బైక్ లు, రెండు మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కేసును ఛేదించిన రామగిరి ఎస్సై టీ శ్రీనివాస్, దివ్య, ముత్తారం ఎస్సై రవి కుమార్‌ను పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి అభినందించారు. ఎస్సై టి శ్రీనివాస్ కు ప్రత్యేక రివార్డ్ అందించనున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.