గుల్జార్‌కు జ్ఞాన్‌పీఠ్ అవార్డు హర్షనీయం
58వ జ్ఞాన్‌పీఠ్ అవార్డుకు హిందీ కవి గుల్జార్ ఎంపికవడంపై కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత వారాల ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు.
- కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత వారాల ఆనంద్
కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 17 : 58వ జ్ఞాన్‌పీఠ్ అవార్డుకు హిందీ కవి గుల్జార్ ఎంపికవడంపై కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత వారాల ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన జీవితంలో సాహిత్యంలో చేసిన సేవలను గుర్తించి జ్ఞాన్‌పీఠ్ అవార్డు కమిటీ ఈ అవార్డును ప్రకటించిందన్నారు. ఆయన హిందీలో రచించిన ‘గ్రీన్ పోయమ్స్’ను తెలుగులో తాను ‘ఆకుపచ్చ కవితలు’గా అనువదించడం వల్లే తనకు కేంద్ర సాహిత్య పురస్కారం పురస్కారం లభించిందన్నారు.
గుల్జార్ గొప్ప కవి, సినీ గేయ రచయిత, సినీ దర్శకుడు అని, ఆయన రచనలు, సినిమాలు, గజల్స్ అన్నీ సృజనాత్మకంగా, తాత్వికంగా ఉంటాయన్నారు. ఆయన కవిత చదివే పద్ధతి శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటుందని, సాంస్కృతిక ప్రక్రియల్లో నిరంతర కృషి కొనసాగిస్తున్న ఒక లెజెండ్ అని కొనియాడారు. ఈ పురస్కారం తెలుగులో సినారె, విశ్వనాథ సత్యనారాయణ, రావూరి భరద్వాజ్ ముగ్గురికి వచ్చిందన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

