MLA Vijayaramana Rao | కాల్వ శ్రీరాంపూర్ సెప్టెంబర్ 7 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం నుండి పెద్దరాత్ పల్లి వరకు నూతనంగా నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులు ఎమ్మెల్యే విజయ రమణారావు మంజూరు చేయించారని కూనారంలో గ్రామస్తులు ఆదివారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నాటికల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. సుమారు 8 కిలోమీటర్ల వరకు నిర్మించే ఈ రహదారి వల్ల పలు గ్రామాలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు.
ఎమ్మెల్యే విజయ రమణారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కూనారం చెరువు కట్ట మీదుగా జాఫర్ ఖాన్ పేట బీటీ రోడ్డు నిర్మాణానికి త్వరలో ఎమ్మెల్యే విజయరమణారావు నిధులు మంజూరు చేయనున్నట్లు పలువురు నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచులు డొంకెన విజయ మొగిలి, గాజనవేన సదయ్య, మాదాసి సతీష్, మాజీ ఎంపీటీసీ సాధనవేన రాజేశ్వరి కొమురయ్య, నాయకులు పెండం శ్రీనివాస్, కుంభం కుమార్, శ్రీకాంత్ ,గొర్ల శ్రీనివాస్, కలవేన రమేష్ ,ఉప్పుల శ్రావణ్, బందారపు మల్లయ్య, గుణాకర్ రెడ్డి ,ఐలయ్య తదితరులు ఉన్నారు.