కలెక్టరేట్, జూన్ 14: ప్రత్యేక కార్యాచర ణ ద్వారా పెండింగ్ ధరణి సమస్యలను పరిషరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పెండింగ్ ధరణి సమస్యల పరిషారంపై శుక్రవారం వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మా ట్లాడుతూ, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిషారానికి మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. తహసీల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారి, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిషరించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు.
సక్సేషన్, పెండిం గ్ మ్యూటేషన్ దరఖాస్తులు, రికార్డులు పరిషరించాలన్నారు. మండలాల వారీగా పెం డింగ్ దరఖాస్తులను రివ్యూ చేసుకోవాలని, అధికంగా పెండింగ్ ఉన్న మండలాలకు అవసరమైన అదనపు సిబ్బంది కేటాయించాలన్నారు. ధరణి వెబ్‌సైట్‌కు సంబంధించి జీఎల్ఎం, టీఎం 33 దరఖాస్తులలో డిజిటల్ సంతకాల ప్రక్రియ మార్పులు చేస్తున్నామని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో నిర్వహించే ప్రజావాణిలో వచ్చే భూసంబంధిత సమస్యలను సైతం కలెక్టర్లకు బదిలీ చేస్తున్న సమస్యలు సత్వర పరిషారం అయ్యేలా చూడాలన్నారు.
ప్రతి మండలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు అనువైన భవనం లేదా భూమి కేటాయించి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ అనురాగ్ జయంతి మా ట్లాడారు. జిల్లాలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళికాబద్ధంగా పరిషరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కు అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీవో రమేశ్, అన్ని మండలాల తహసీల్దార్లు, అధికారులు హాజరయ్యారు.