సుల్తానాబాద్ రూరల్, మే 10: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ కోడెల (Vemulawada Kodelu) కోసం కనుకుల గ్రామ ప్రజలు పెద్దమొత్తంలో పశుగాసం వితరణ చేశారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలోని జానకిరామ ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కనుకుల, రాముని పల్లి , మారుతి నగర్ , మంచరామి గ్రామాల ట్రాక్టర్ ఓనర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్, రైతులు గ్రామాల నుంచి దాదాపుగా 42 ట్రాక్టర్ల వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి తరలించారు.
ఆలయంలోని కోడెల కోసం పశుగాసం వితరణ చేశారు. ఈ సందర్భంగా జానకిరామ ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ. గత ఎనిమిది సంవత్సరాల నుంచి వేములవాడ ఆలయానికి పశుగాసాన్ని తరలించడం జరుగుతుందన్నారు. గోమాతలకు పశుగాసం ఎంతో దోద పడుతుందన్నారు. రైతులు పశుగాసాన్ని వృధా చేయకుండా గోమాతలకు అందించాలని కోరారు. వేములవాడ రాజన్న ఆశీస్సులు ప్రజలందరికీ ఇవ్వాలని వారు కోరారు.