Singareni | రామగిరి, జూలై 25: సులబ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ పై హెచ్ఆర్సీ(HRC)లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైనట్లు సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ సంస్థలో గత 30 సంవత్సరాలుగా సులభ్ పనిచేసే వర్కర్స్ కు సరైన వేతనం ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేయడం తో ఆ సంస్థ పై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
సింగరేణి యాజమాన్యం చెల్లిస్తున్న డబ్బులతో రూ.లక్షల కోట్లు దోచుకు తింటుందని ఆరోపించారు. ఈ సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు కనీసం ఈఎస్ఐ, ఈపీఎఫ్ చెల్లించడం లేదని పేర్కొన్నారు. సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో పోరాటాలు చేసినప్పటికీ సింగరేణి యాజమాన్యం, సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వచ్ఛంద సేవా ముసుగులో సింగరేణి యాజమాన్యం వద్ద నుంచి ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ రూ.కోట్లను దోచుకుంటుందని, పైగా మాది స్వచ్ఛంద సంస్థ అని సింగరేణి యాజమాన్యాన్ని కార్మికులను ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సులబ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ అగ్రిమెంట్‌ను రద్దు చేసి వర్కర్లకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ అమలు చేసే సంస్థకు అప్పగించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆయన డిమాండ్ చేశారు.