Municipal worker | వేములవాడ, జూన్ 15: చెత్త కుప్ప ఎత్తమని మాటకు మాట పెరిగి మున్సిపల్ జవాన్ పై దాడి చేసిన సంఘటన ఆదివారం వేముల వారి పట్టణంలో చోటుచేసుకుంది. కోరుట్ల బస్టాండ్ నుండి మల్లారం వెళ్లే రహదారిలో మున్సిపల్ సిబ్బంది రోడ్డుపై చెత్త కుప్పలను వాహనంలోకి ఎత్తుతున్నారు. ఇదే రహదారిలోని కార్ వాష్ దుకాణం ముందు ఉన్న చెత్త కుప్పలను ఎత్తాలని యజమాని మున్సిపల్ కార్మికులకు సూచించాడు. వరుస క్రమంలో అదే పని చేసుకుంటూ వస్తున్నామని తర్వాత మీది కూడా ఎత్తుతామని సమాధానం చెప్పారు.
ముందుగా ఇదే ఎత్తాలని లేదంటే రోడ్డు మీద పడేస్తానని కారు వాష్ యజమాని కార్మికులను దుర్భాషలాడారని వాపోయారు. అక్కడికి చేరుకున్న మున్సిపల్ జవాన్ మహేందర్ పై కూడా అదే వాగువాదంతో దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రమ పద్ధతిలో తాము చెత్తను తొలగిస్తున్నామని చెప్పిన వినకుండా దుర్భాషలాడుతూ దాడికి దిగాడని జవాన్ మహేందర్ వాపోయారు. కార్మికులను దుర్భాషలాడమే కాకుండా దాడి చేసిన సదరు యజమానిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.