Accident | పెద్దపల్లి రూరల్, మే 26 : పెద్దపల్లి మండలం పెద్దకల్వల సమీపంలో సోమవారం సాయంత్రం కాళేశ్వరం సరస్వతి పుష్కరస్నానాలకు వెళ్లి వస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. గాయాలపాలైన వారిని కరీంనగర్ దవాఖానకు చికిత్స నిమిత్తం అంబులెన్స్ ద్వారా తరలించారు.
స్థానికుల కథనం ప్రకారం కాళేశ్వరం సరస్వతీ పుష్కర స్నానాలకు వెళ్లి వస్తున్న కారును వెనుక నుంచి అదే వరుసలో వస్తున్న మరో వాహనం ఢీకొనడంతో వరుసగా మూడు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. కాళేశ్వరం వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో కరీంనగర్ కు వెళ్తుండగా పెద్దపల్లి మండలం పెద్దకల్వల సమీపంలో మహబూబ్ బేగ్ ఫంక్షన్ హల్ ముందు వెనుక నుండి గుర్తు తెలియని వాహనం గుద్దడం వలన దాదాపు మూడు కార్లు ఒకదానికొకటి తగలడం వల్ల కారు పల్టీ కొట్టంది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు గాయాల పాలయ్యారు.