బీఆర్ఎస్ నేత కూతురికి కేటీఆర్ బర్త్‌డే గిఫ్ట్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగ్గిల్ల సంజీవ్‌గౌడ్ కూతురు హర్షితకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆశీర్వాదం అందించారు.
- హైదరాబాద్ పిలిపించుకొని బర్త్‌డే శుభాకాంక్షలు
- చిరుకానుక అందజేత
- బాగా చదుకోవాలని సూచించిన వర్కింగ్ ప్రెసిడెంట్
సిరిసిల్ల రూరల్, జనవరి 8: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగ్గిల్ల సంజీవ్‌గౌడ్ కూతురు హర్షితకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆశీర్వాదం అందించారు. ఏడో తరగతి చదువుతున్న హర్షితకు కేటీఆర్ అంటే ఎంతో అభిమానం కాగా, జనవరి 7న ఆమె పుట్టిన రోజును పురస్కరించుకొని తండ్రి సంజీవ్ కేటీఆర్‌కు మెస్సేజ్ చేశారు. స్పందించిన కేటీఆర్ హర్షితకు బర్త్‌డే విషెస్ తెలిపారు.
ఈ క్రమంలో ‘సర్ మా పాపకు మీరంటే ఎంతో అభిమానం. మీ ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటోంది’ అని సంజీవ్ మళ్లీ మెస్సేజ్ చేయగా, చిన్నారిని తీసుకొని హైదరాబాద్ రావాలని సూచించారు. సోమవారం సంజీవ్ తన కూతురుతో కలిసి తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిశారు. హర్షితను ఆశీర్వదించిన కేటీఆర్, ధాన్యం బస్తాలతో కూడిన ఎడ్ల బండిని చిరు కానుకను అందించి, బాగా చదువుకోవాలని సూచించారు. చిరుకానుకతో సంబురపడ్డ హర్షిత కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

