ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు
రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ ప్రధాన పాత్రలు పోషించిన డార్క్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆ (AH)’. సాయిబాలి దర్శకుడు.
రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ ప్రధాన పాత్రలు పోషించిన డార్క్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆ (AH)’. సాయిబాలి దర్శకుడు. కనకరావు తొనంగి, అభిషేక్ కె, గ్యారీ బీహెచ్ నిర్మాతలు. ఈ నెల 12న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి, డైరెక్టర్ నందినీరెడ్డి, హీరో ఆకాష్ పూరి, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టని సినిమా ఇది. మూవీ నచ్చితే ఓ పదిమందికి చెప్పండి.
దర్శకుడు సాయిబాలికి ఈ సినిమాతో మంచి పేరొస్తుంది. మనసుపెట్టి పనిచేసిన సినిమా ఇది’ అని హీరో రాహుల్ విజయ్ అన్నారు. ప్రతి అమ్మాయికీ కకెక్ట్ అయ్యే కథ ఇదని, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హంట్ చేసేలా సినిమా ఉంటుందని కథానాయిక అర్చన అయ్యర్ చెప్పారు. స్టోరీ, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుందని, శ్రీచరణ్ సంగీతం ఈ చిత్రానికి వెన్నెముకని దర్శకుడు సాయి బాలి తెలిపారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, సహ నిర్మాత అభినవ్ కునపరెడ్డి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kancherla Bhupal Reddy | కంచర్ల భూపాల్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. చిట్యాలలో ఉద్రిక్తత
Meenakshi chaudhary | “నాకు క్రష్ లేదు.. నా జీవితమే క్రష్ అయిపోయింది”.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఫోన్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య
Anirudh-Kavya Maran | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లికి అన్ని కోట్లు ఖర్చు అయిందా.. షాక్‌లో సినీ ప్రియులు
Tollywood | బాక్సాఫీస్ వద్ద రెండు మంచి సినిమాలు.. ‘ENE రిపీట్’, ‘ఆకాశంలో ఒక తార’కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

