మోముపై చిరునవ్వులు తెప్పిస్తుంది!
విభిన్న నేపథ్యాలు, మనస్తత్వాలు కలిగిన ఇద్దరు పిల్లలు వేసవి సెలవుల్లో కలుసుకొని స్నేహితులుగా మారితే ఎలా ఉంటుందనే పాయింట్‌తో ‘సమ్మర్ హాలీడేస్' చిత్రాన్ని తీశామని చెప్పారు దర్శకుడు శ్రీకర్ నయన్.
విభిన్న నేపథ్యాలు, మనస్తత్వాలు కలిగిన ఇద్దరు పిల్లలు వేసవి సెలవుల్లో కలుసుకొని స్నేహితులుగా మారితే ఎలా ఉంటుందనే పాయింట్‌తో ‘సమ్మర్ హాలీడేస్’ చిత్రాన్ని తీశామని చెప్పారు దర్శకుడు శ్రీకర్ నయన్. మాస్టర్ రోహన్, అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం దర్శకుడు శ్రీకర్ నయన్ విలేకరులతో
ముచ్చటించారు.
మనందరి బాల్యం తాలూకు వేసవి సెలవుల జ్ఞాపకాల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు. ‘ఈ సినిమాలో జయసుధగారు అమ్మమ్మ పాత్రలో నటించారు. అరుణ్, జయసుధ మధ్య వచ్చే కొన్ని సీన్స్ కన్నీళ్లు పెట్టిస్తాయి. అలాగే వాసుకీగారి పాత్ర కూడా కథలో కీలకంగా ఉంటుంది. పిల్లలకు ఉండే సమస్యలు.. వేసవి సెలవుల్లో వాటికి ఎలాంటి పరిష్కారం దొరికిందనే అంశం చుట్టూ కథ నడుస్తుంది.
ఇటీవలకాలంలో విరివిగా వస్తున్న యాక్షన్, వయొలెన్స్ సినిమాలు చూసి ప్రేక్షకులు విసిగిపోయారు. ఇలాంటి సమయంలో ప్రేక్షకుల మోముపై చిరునవ్వులు తెప్పించే సినిమా ఇది. కథలోని భావోద్వేగాలు హృదయాల్ని కదిలిస్తాయి. ఇది పిల్లల సినిమా కాదు. పిల్లలు నటించిన పెద్దల సినిమా’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

