రాప్తాడు ఘటనలో నిందితుడి కాళ్లకు సర్జరీ
అనంతపురం జిల్లా రాప్తాడు హైసూల్లో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో నిందితుడి కాళ్లలో బుల్లెట్లు దిగాయి. దీంతో హేమంత్‌ను అనంతపురం ప్రభుత్వ దవాఖానకు(జీజీహెచ్) తరలించి సర్జరీ చేశారు
-
కాళ్లు తొలగించాల్సి ఉంటుందని సూచించిన వైద్యులు
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : అనంతపురం జిల్లా రాప్తాడు హైసూల్లో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో నిందితుడి కాళ్లలో బుల్లెట్లు దిగాయి. దీంతో హేమంత్‌ను అనంతపురం ప్రభుత్వ దవాఖానకు(జీజీహెచ్) తరలించి సర్జరీ చేశారు. కాళ్లలో దిగిన బుల్లెట్లను తొలగించినప్పటికీ, కుడికాలు మోకాలి చిప్పలు ఛిద్రం కావడంతో కుడికాలు లేదా రెండు కాళ్లు తొలగించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు.
ప్రస్తుతం అతనికి ప్రత్యేక భద్రత మధ్య చికిత్స అందిస్తున్నారు. నిందితుడు హేమంత్పై పోలీసులు ఆరు రౌండ్ల కాల్పులు జరపడం, గాయపడిన వ్యక్తిని దవాఖానలోకి ఈడ్చుకెళ్లిన తీరుపై ఏపీ హైకోర్టులో ఒక న్యాయవాది పిల్ దాఖలు చేశారు. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. పాఠశాలలో హేమంత్ దాడిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి బాలిక ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ దవాఖానలో చికిత్స పొందుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

