హంతకుడిని కాదు ప్రేమికుడిని!
బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ సోమవారం జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు.
బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ సోమవారం జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘కింగ్’ నుంచి ‘తు మిల్ జాయే’ అనే పాటను విడుదల చేశారు. ఆర్జిత్సింగ్ గాత్రం, గ్లోబల్ పాప్‌స్టార్ ఎడ్ షీరన్ ఇంగ్లీష్ ర్యాప్, మధుబంతి బాగ్చి స్వరం కలబోతగా ఈ పాట సంగీతప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈ గీతానికి సచిన్-జిగర్ సంగీతాన్నందించారు. ఇందులో షారుఖ్‌ఖాన్, దీపికా పడుకోన్ జోడీ మరోమారు తమ కెమిస్ట్రీతో మెస్మరైజ్ చేశారు. ‘కింగ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మొదలయ్యే ఈ పాటలో షారుఖ్‌ఖాన్ చెప్పిన డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి.
‘నేను హంతకుడిని కాదు. ప్రేమికుడిని’ అనే సంభాషణతో తన పాత్రపై ఆసక్తిని పెంచారు. రొమాన్స్, ైస్టెలిష్ విజువల్స్, యాక్షన్ హంగులతో ఈ పాటను రూపొందించారు. పాట చివర్లో ‘ఈసారి గుండెలో మంట మొదలైంది. ఇప్పుడు ప్రపంచాన్ని తగలబెట్టే వరకు అది ఆగదు’ అనే డైలాగ్ సినిమా కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

