జగిత్యాల/జగిత్యాల రూరల్/ జగిత్యాల అర్బన్, జూన్ 24: ‘జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ డౌన్ డౌన్..తెలంగాణ ద్రోహికి బుద్ధిచెబుతాం..అవకాశవాది రాజకీయ జీవితాన్ని సమాధిచేస్తాం..’అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి. కారు గుర్తుపై గెలిచి హస్తం పార్టీ వంచన చేరడంపై భగ్గుమన్నాయి. సోమవారం జగిత్యాల జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలిపాయి. పెద్దసంఖ్యలో బీ ఆర్ఎస్ కార్యకర్తలు జిల్లాకేంద్రంలోని ఆయన ఇంటిని, దవాఖానను ముట్టడించి బైఠాయించారు. రాజీనామా చేయాలని ఇంటి గోడలకు స్టిక్కరు అంటించారు. స్థానిక తహసీల్ చౌర స్తా వద్ద మాకునూరి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత హాజరై శ్రేణుల్లో ఆత్మైస్థెర్యం నిం పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన సంజ య్ బీఆర్ఎస్ను వీడడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆత్మహత్యాసదృశ్యమైన చర్యగా అభివర్ణించారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని..కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని భరోసానిచ్చారు. కష్ట కాలంలో పార్టీని మోసం చేసిన సంజయ్‌ని జగిత్యాలలో తిరుగనివ్వమని, అ లాంటి ఆయన బతికినా చచ్చిన శవంతో స మానమేనన్నారు.
నీతి నిజాయితీ తెలంగాణ పౌరుషం ఉంటే, ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేసి మళ్లీ గెలువాలని సవాల్ విసిరారు. కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ సంజయ్ ఉద్యమంలో లేకున్నా పార్టీ టికెట్ ఇస్తే నమ్మకద్రోహం చేశారని విరుచుకుపడ్డా రు. దావ వసంతా సురేశ్ మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత కాలికి బట్ట కట్టకుండా తిరిగి మూడుసార్లు, ఎమ్మెల్యే గా గెలిపిస్తే ద్రోహం చే యడం బాధాకరమన్నా రు.
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మా ట్లాడుతూ నిజంగా నీకు ద మ్ము ధైర్యం ఉంటే కారు గుర్తుపై గెలిచిన నువ్వు రాజీనామాచేసి మళ్లీ ప్రజల మన్ననన పొందాలన్నారు. ఇందులో బీఆర్ఎస్ సీనియర్ నేత ఓరుగంటి రమణారావు, మా ర్క్‌ఫెడ్ మా జీ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ హ రిచారణ్రావు, జడ్పీటీసీ నాగం భూమన్న, కేడీసీసీబీ మెంబర్ రాంచందర్‌రా వు, ఎంపీపీ సంధ్యారాణి, రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, రాయికల్ మండలాధ్యక్షుడు కొల శ్రీనివాస్, శీలం ప్రియాంక, ఉదయశ్రీ, నాగేశ్వర్ రావు, వొల్లెం మల్లేశం పాల్గొన్నారు.

మెట్పల్లి,జూన్24 జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ దిష్టిబొమ్మ ను సోమవారం మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దహనం చే శారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్‌లో చేరడం దారుణమని ఖండించా రు. ఇక్కడ ఎంపీ పీ సా యిరెడ్డి, నేతలు తోట శ్రీ నివాస్, దేవమల్ల య్య, పీసు తిరుపతిరెడ్డి, శ్రీధ రాజగౌడ్, ము దాం న ర్సింలు, బద్దం శేఖర్‌రెడ్డి, నోముల గంగాధర్, రాం రెడ్డి, జగన్, నరే శ్, కిషో ర్, వెంకటేశ్ ఉన్నారు.
మల్యాల, జూన్ 24: మల్యాలలో జగిత్యా ల ఎమ్మెల్యే సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మధుసూదన్‌రావు, తిరుపతిరెడ్డి, తిరుపతి, అజహర్, రియాజ్, అనిల్‌రెడ్డి, అమీర్, ప్రవీణ్, కొంక నర్సయ్య, మల్లేశం గౌడ్, దుర్గయ్య, రంజిత్, శైలేశ్ ఉన్నారు.