Vemulawada | కోనరావుపేట : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో వేములవాడ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఎన్నికలు నిర్వహించగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆయన కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామమైన కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.