Cheeti Narsingha Rao | సిరిసిల్ల రూరల్, ఆగస్టు 9: బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు జన్మదిన వేడుకలు శనివారం ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తంగళ్ళపల్లి మండలం మండేపల్లి శివారులోని ప్రభుత్వ వయోజన వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్ ను అందజేశారు. వృద్ధాశ్రమంలోని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నేత నర్సింగరావు నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్లా మధు, వలకొండ వేణుగోపాల్ రావు, జక్కుల నాగరాజు యాదవ్, గుగ్గిళ్ళ అంజయ్య గౌడ్, సురభి నవీన్ రావు, మోతే మహేష్ యాదవ్, బండి జగన్, సిలువేరి నరసయ్య, ఆవునూరి వెంకట రాములు, కేటీఆర్ సేనా మండల అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, సిలువేరి చిరంజీవి, అనిల్ గౌడ్, ఆఫ్రోజ్, అమర్ రావు, గుండు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.