సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 17: లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పష్టం చేశారు. రైతు వ్యతిరేకి రేవంత్రెడ్డి మన రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం ప్రజల దురదృష్టమని విచారం వ్యక్తం చేశారు. భూముల కోసం రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిన దుర్మార్గమైన చరిత్ర ఆయనదని తీవ్రంగా విమర్శించారు. లగచర్ల రైతులపై వెంటనే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం సిరిసిల్లలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు తొలి ప్రాధాన్యం కల్పించారని కొనియాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సొంత కుటుంబ సభ్యుల కోసం రైతులు భూములు బలవంతంగా లాక్కొంటున్నారని, తిరగబడిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసి నిరంకుశ పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. ఉద్యమాలకు నిలయమైన తెలంగాణ గడ్డపై రేవంత్రెడ్డి పాలన ఎంతోకాలం నిలవబోదన్నారు. కార్యక్రమంలో టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, దిడ్డి రమాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, నాయకులు బొల్లి రామ్మోహన్, దార్నం అరుణ, అడ్డగట్ల మురళి, అన్నారం శ్రీనివాస్, దార్ల సందీప్, గజభీంకార్ రాజన్న, సురేందర్రావు, కొమ్ము బాలయ్య, గుగులోత్ సురేశ్నాయక్, కృష్ణహరి, పరశురాంగౌడ్, మాట్ల మధు, సామల శ్రీనివాస్, బండారి శ్రీనివాస్, వెంగళ శ్రీనివాస్, పోరండ్ల రమేశ్, గడ్డం భగవాన్, వీరబత్తిని కమలాకర్, పోచవేని ఎల్లయ్య, రాజిరెడ్డి, కల్లూరి మధు, తదితరులు పాల్గొన్నారు.