ఓదెల, ఏప్రిల్ 5 : ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ బహిరంగ సభకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఓదెలలోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు ఓదెల మండలం నుంచి అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పనులను ప్రజలకు వివరించాలని, కార్యకర్తలు బీఆర్ఎస్ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ గంట రాములుయాదవ్, యూత్ మండలాధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్‌గౌడ్, నాయకులు గట్టు శ్రీనివాస్, ఆరెల్లి మొండయ్యగౌడ్, మద్దెల శ్రీనివాస్, రౌతు జలపతి, పత్తి సమ్మిరెడ్డి, గొర్ల కుమార్, నోముల ఇంద్రారెడ్డి, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.