కార్పొరేషన్/ చొప్పదండి(రామడుగు)/ హుజూరాబాద్ టౌన్/ సైదాపూర్/ చిగురుమామిడి, మార్చి 16: ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్ట్‌పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ అధిష్ఠానం పిలుపుమేరకు శనివారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. నగరంలోని తెలంగాణచౌక్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. తెలంగాణ పోరాటంలో కీలకభూమిక పోషించిన ఆడబిడ్డను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రధాని మోదీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, బీఆర్ఎస్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ఓర్వలేకే మోదీ సర్కారు ఈ దుర్మార్గానికి ఒడిగట్టిందని ధ్వజమెత్తారు.
కవితకు న్యాయం జరిగేదాకా పోరాటాన్ని ఆపేదిలేదని తేల్చిచెప్పారు. లిక్కర్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతుండగానే ఈడీ ఎలా అరెస్ట్ చేసిందని ప్రశ్నించారు. మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో కవితను అరెస్ట్ చేయబోమని చెప్పిన ఈడీ, కోర్టు ధిక్కారానికి పాల్పడిందని దుయ్యబట్టారు. ప్రజలు తగిన సమయంలో బీజేపీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మాజీ మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై బీఆర్ఎస్ను అణచివేయాలన్న ఉద్దేశంతో కవితను అరెస్ట్ చేయించాయన్నారు.
బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్ మాట్లాడుతూ, అక్రమ అరెస్ట్‌లను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కొత్తపల్లి వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, కంసాల శ్రీనివాస్, నాయకులు పెండ్యాల మహేశ్, రేణుక, గుంజపడుగు హరిప్రసాద్, ఆరె రవి, చంద్రశేఖర్, దూలం సంపత్, వసంతరావు, వోడ్నాల రాజు, గంట శ్రీనివాస్, అర్ష మల్లేశం, రాధ, శ్యాంసుందర్‌రెడ్డి, రాజు, శ్రీనివాస్ ఉన్నారు. చొప్పదండిలో బీఆర్ఎస్ నాయకులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రామడుగులో ధర్నా, రాస్తారోకో చేశారు.
చొప్పదండిలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు గడ్డం చుకారెడ్డి, ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, నాయకులు వినయ్, బందారపు అజయ్‌కుమార్‌గౌడ్, మేకల తిరుపతి, పిట్టల సత్యం, గుల్లేటి తిరుపతి, రామడుగులో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నేత, సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, నాయకులు కలిగేటి లక్ష్మణ్, గంట్ల వెంకట్‌రెడ్డి, ఎలుకపెళ్లి లచ్చయ్య, పంజాల ప్రమీలాజగన్మోహన్గౌడ్, మామిడి నర్సయ్య, దాసరి రాజేందర్‌రెడ్డి, చాడ ప్రభాకర్‌రెడ్డి, నాగి శేఖర్, బండ అజయ్‌రెడ్డి, చాడ శేఖర్‌రెడ్డి, జవ్వాజి శేఖర్, బకచెట్టి నర్సయ్య, సైండ్లా కరుణాకర్, పాపిరెడ్డి, కనకం కనకయ్య, జూపాక మునీందర్, గునుకొండ అశోక్, ఒంటెల వెంకటరమణారెడ్డి, శనిగారపు అనిల్ కుమార్, కొడిమెల రాజేశం, గడ్డం మోహన్‌రావు, చెన్నూరు శ్రీకాంత్‌రెడ్డి, ఎండీ సోహెల్, లంక మల్లేశం, వరుణ్‌రెడ్డి శనిగారపు అర్జున్, ఆరెపల్లి ప్రశాంత్ ఉన్నారు.
హుజూరాబాద్‌లో అంబేదర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసి, కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్సీ కవితను వెంటనే విడుదల చేయాలన్నారు. ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సొంత పూచీకత్తుపై అనంతరం విడుదల చేశారు. కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, బీఆర్ఎస్ హుజూరాబాద్, జమ్మికుంట పట్టణ, మండలాధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సంగెం ఐలయ్య, టంగుటూరి రాజ్‌కుమార్, కల్లెపల్లి రమాదేవి, రాష్ట్ర నాయకులు వర్దినేని రవీందర్రావు, సంపత్‌రావు, సత్యనారాయణరావు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
సైదాపూర్ మండలకేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు చంద శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి చెల్మల రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ ఓదెలు, నాయకులు కొండ గణేశ్, గొల్లపల్లి శ్రీనివాస్, పైడిమల్ల తిరుపతిగౌడ్, పోలోజు రాజు, గడ్డం శేఖర్, పైడిపల్లి రవీందర్‌గౌడ్, కొమురయ్య, మోహన్‌రావు, ఐలయ్య, ఆదిరెడ్డి, సురేశ్, నరేశ్, అశోక్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
చిగురుమామిడిలోని ప్రధాన రహదారిపై బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత, జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మంకు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి మల్లేశం, మండల నాయకులు పేనుకుల తిరుపతి, సర్వర్ పాషా, అనుమాండ్ల సత్యనారాయణ, గ్రామాధ్యక్షులు కత్తుల రమేశ్, పిల్లి వేణు, చామకూర సంపత్ రెడ్డి, ఎస్కే సిరాజ్, యాల్ల జనార్దన్ రెడ్డి, బుర్ర తిరుపతి, మాజీ సర్పంచ్ సిద్ధార ప్రవీణ్, మండల కోఆప్షన్ మెంబర్ మక్బుల్ పాషా, కొత్త కైలాసం, నాగెల్లి రాజిరెడ్డి, దేశిని రాజయ్య, మహంకాళి కొమురయ్య, కిష్టారెడ్డి సంపత్ తదితరులు పాల్గొన్నారు.