BRS | కథలాపూర్, ఆగస్టు 2 : కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలను అక్కడి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొని కథలాపూర్ పోలీసులకు తీసుకువచ్చారు. కోరుట్ల బీఆర్ఎస్ నేతలకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు నాగేశ్వర్ రావు, గంగారెడ్డిలు కలిసి మద్దతు తెలిపారు.
బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, అరెస్ట్ చేయడం దారుణమని కథలాపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. అరెస్టు అయినవారిలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చీటి వెంకటరావు, మాజీ సర్పంచ్ రాజేశం, పిడుగు సందయ్య తదితరులు ఉన్నారు.