Siricilla | ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 3: బొప్పాపూర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు గడ్డి నరసయ్య (55) అనారోగ్యంతో మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నరసయ్యను రెండు రోజుల క్రితం చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. నరసయ్య గతంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పని చేశారు. విషయం తెలుసుకున్న పలువురు నాయకులు నరసయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.