కార్పొరేషన్/హుజూరాబాద్(జమ్మికుంట)/చొప్పదండి/ హుజూరాబాద్ టౌన్/ ఇల్లందకుంట/ సైదాపూర్/ వీణవంక/మానకొండూర్/ శంకరపట్నం/ చిగురుమామిడి, అక్టోబర్ 20: నగరంలోని తెలంగాణ చౌక్‌లో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు తరలివచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, హామీలు ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్ గౌడ్, బీఆర్ఎస్ కరీంనగర్ రూరల్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, కొత్తపల్లి మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్ గౌడ్, రైతు నాయకుడు మంద రాజమల్లు, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, సాగర్, ఐలేందర్, బీఆర్ఎస్ నాయకులు హరిప్రసాద్, చంద్రశేఖర్, మధు, రాజేందర్, శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు రైతన్నలు సిద్ధంగా ఉన్నారన్నారు. సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు భరోసా ఇవ్వకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తాళ్లపెల్లి శ్రీనివాస్, ముక్క రమేశ్, ముత్యం రాజు, రమాదేవీరవిశంకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు డాక్టర్ ఐలయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మారెట్ కమిటీ మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సింగిల్ విండో డైరెక్టర్లు, మాజీ ఉప సర్పంచులు, మాజీ వార్డ్ సభ్యులు, గ్రామాధ్యక్షులు, గ్రామ యూత్ అధ్యక్షులు, రైతు సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి డబ్బులను ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై టైర్లువేసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. దాదాపు అరగంటపాటు ధర్నా చేసిన తర్వాత పోలీసులు బలవంతంగా ధర్నాను విరమింప జేశారు. కొందరిని రోడ్డుమీద ఉండకుండా ఈడ్చుకుంటూ పక్కకు లాక్కెళ్లారు. బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్టేషన్‌కు తీసుకెళ్లి సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఇక్కడ నాయకులు టంగుటూరి రాజ్‌కుమార్, పొనగంటి సంపత్, కనపర్తి లింగారావు, ఎం దిలీప్, రాజేశ్, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, మనోహర్‌రావు తదితరులున్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఇక్కడ పీఏసీఎస్ వైస్ చైర్మన్లు కొమురెల్లి, వీరస్వామి, మాజీ ప్రజాప్రతినిధులు రాజిరెడ్డి, దిలీప్‌రెడ్డి, రాజు, మొగిలి, రఫీఖాన్, మాజీ ఎంపీటీసీ ఓదెలు, రాంస్వరణ్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, కుమార్, నరేందర్, వాసుదేవరెడ్డి, మురళి, కౌశిక్, రత్నాకర్, శేషు, దేవేందర్ తదితరులు ఉన్నారు. సైదాపూర్‌లోని కొత్తబస్టాండ్ వద్ద బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, వెన్నంపల్లి సింగిల్‌విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, నాయకులు సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి, రావుల రవీందర్‌రెడ్డి, తొంట ఓదెలు, పైడిమల్ల తిరుపతి, తొంట రజినీకాంత్, పైడిపల్లి రవీందర్, చిక్కుల సంపత్, మాదం స్వామియాదవ్, పోతిరెడ్డి హరీశ్‌రావు, పరుకాల నారాయణ, చాడ ఆదిరెడ్డి, వర్నె మోహన్‌రావు, పిల్లి కొమురయ్య, తాటిపల్లి జితేందర్‌రెడ్డి, కొంకట సంపత్, దోకిడి తిరుపతి, శ్యాంరెడ్డి, రమేశ్, శ్రీనివాస్, రవి, ప్రవీణ్, అనిల్, విజయ్, రమేశ్, నారాయణ ఉన్నారు. వీణవంక మండలకేంద్రంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు తాళ్లపల్లి మహేశ్‌గౌడ్, నాయకులు బండారి ముత్తయ్య, పోతుల నర్సయ్య, కిషన్‌రెడ్డి, రమేశ్, సత్యనారాయణ, మధుసూదన్‌రెడ్డి, సారయ్య, దేవేందర్‌రెడ్డి, యాసిన్, శ్రీకాంత్, రమేశ్, భిక్షపతి, చైతన్య, రాజన్న, మధుకర్, కుమార్, రాజు, మొండయ్య, రవి తదితరులు ఉన్నారు.
మానకొండూర్ మండల కేంద్రంలోని కరీంనగర్- వరంగల్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ, రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో నాయకులు ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, బోళ్ల వేణుగోపాల్, నామాల శ్రీనివాస్, గడ్డం సంపత్, షేక్మీర్బాబా, గోపు ఈశ్వర్‌రెడ్డి, మర్రి అశోక్‌యాదవ్, ఆరెపల్లి కిరణ్, అనవేణి రాజు, బొల్లం అనిల్, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్ మాట్లాడుతూ, రైతు భరోసా అమలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ పొద్దుటూరి సంజీవరెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎల్ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సతీశ్‌రెడ్డి, పీ సంజీవరెడ్డి, పీ రాజయ్య, శేషాచారి, సీహెచ్ వీరస్వామి, డీ భద్రయ్య, ఆదిత్య, రమేశ్, తిరుపతి, శంకర్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మంకు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, డైరెక్టర్ పోతులవేణి శ్రీనివాస్, మండల నాయకులు పెనుకుల తిరుపతి, హనుమాండ్ల సత్యనారాయణ, రామోజు కృష్ణమాచారి, బెజ్జంకి రాంబాబు, నాగేల్లి రాజిరెడ్డి, మెడబోయిన తిరుపతి, పెసర రాజేశం, జకుల రవీందర్, దుడ్డేల లక్ష్మీనారాయణ, భూమి రెడ్డి, మక్బుల్ పాషా, బోయిన మనోజ్, చెప్యాల నారాయణరెడ్డి, గ్రామాధ్యక్షులు ఆకవరం శివప్రసాద్, బోయిని రమేశ్, బుర్ర తిరుపతి, గిట్ల తిరుపతిరెడ్డి, బిల్ల వెంకట్ రెడ్డి, యాళ్ల జనార్దన్ రెడ్డి, ఎస్ కే సిరాజ్, పిల్లి వేణు, చామకూర సంపత్ రెడ్డి, కొమ్మెర భూపతిరెడ్డి, తోడేటి శ్రీనివాస్, కయ్యం సారంగం పాల్గొన్నారు. చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తావద్ద బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టగా, నాయకులు గడ్డం చుక్కారెడ్డి, బందారపు అజయ్‌కుమార్ గౌడ్, మాచర్ల వినయ్, చీకట్ల రాజశేఖర్, ఏనుగు స్వామిరెడ్డి, గాండ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సర్కారు రైతు భరోసాతో పాటు రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకో చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు చోట్ల సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
చిగురుమామిడి, అక్టోబర్ 20: రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అంబేదర్ చౌరస్తా వద్ద రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో చెలగాటమాడితే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
గంగాధర, అక్టోబర్ 20: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతున్నదని, రైతుల చేతిలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు. ఆదివారం మండలంలోని మధురానగర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సాగి మహిపాల్‌రావు, కంకణాల విజేందర్‌రెడ్డి, వేముల దామోదర్, వేముల అంజి, రామిడి సురేందర్, ఆకుల మధుసూదన్, మడ్లపెల్లి గంగాధర్, ఎండీ నజీర్, ముక్కెర మల్లేశం, తోట మహిపాల్, వడ్లూరి ఆదిమల్లు, లింగాల దుర్గయ్య, గడ్డం స్వామి, ఎండీ అబ్బాస్, గంగాధర కుమార్, సుంకె అనిల్, మామిడిపెల్లి అఖిల్, గుంటుకు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.