BRS leaders | చిగురుమామిడి, సెప్టెంబర్ 22: చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎస్కే సిరాజ్ పాషా తండ్రి ఎస్కే మహమ్మద్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో పలువురు నాయకులు వారి నివాసానికి వెళ్లి మృతదేహం వద్ద నివాళులర్పించారు. అలాగే గునుకుల పల్లెలో బీఆర్ఎస్ నాయకులు కొమ్మెర మహేందర్ రెడ్డి తల్లి, గునుకుల రాజేశ్వర్ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించారు.
మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ర శ్రీహరి ఇటీవల మృతిచెందగా కోహెడ మండలం శనిగరంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాప సభలో పాల్గొన్నారు. కర్ర శ్రీహరి మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. పరామర్శించిన వారిలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, ఆర్బిఎస్ మండల మాజీ అధ్యక్షుడు పెనుకుల తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షులు కత్తుల రమేష్, నాగేళ్లి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ బోయిని శ్రీనివాస్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి సర్వర్ పాషా తదితరులున్నారు.