బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభలకు రానున్నారు. ఈ నెల 13 నుంచి రెండో విడుత ప్రచారానికి శ్రీకారం చుడుతున్న ఆయన, 17వ తేదీ నుంచి ఏడు చోట్ల సభల్లో పాల్గొననున్నారు.
17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, 20న మానకొండూర్, 24న రామగుండం, 26న జగిత్యాల, వేములవాడలో సభలకు హాజరుకానున్నారు.కాగా, మొదటి విడుతకు సంబంధించి గత నెల 15 హుస్నాబాద్, 17న సిరిసిల్ల, ఈ నెల 2న ధర్మపురి, 3న కోరుట్లలో హాజరు కాగా, ఈ నెల 7న పెద్దపల్లి, మంథనిలో జరిగే సభలో పాల్గొననున్నారు.
– కరీంనగర్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి)