Kamanpur | కమాన్ పూర్, జులై 22 : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఆరోగ్య కేంద్రం ముందు ప్రధాన రహదారి పై ధర్నా-రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా-రాస్తారోకో చేస్తున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బీఆర్ఎస్ నాయకుల ఆందోళనను విరమింపజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కమాన్పూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో స్టాఫ్ నర్సులు లేరని, అన్ని రకాల మందులు సరిపడా లేవని, ఆసుపత్రి ఆవరణలోని క్వార్టర్లు శిథిలావస్థలో ఉన్నాయని ఆరోపించారు. అలాగే కమాన్ పూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా ఆఫగ్రేడ్ చేయాలని, ఆసుపత్రి ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ శంకర్, యూత్ మండల మాజీ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, మాజీ జడ్పీటీసీ మేకల సంపత్ యాదవ్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, నాయకులు గాదె సదయ్య, రాచకొండ రవి, దండే కిషన్, బోయిని బాలకృష్ణ, ఎలాబోయిన రామ్మూర్తి, తోట రాజు కుమార్, పెండ్లి నారాయణ, పంతకానీ రవి, భూపెల్లి మల్లేష్, కొయ్యడ రవి తదితరులు పాల్గొన్నారు.