Chandurthi | చందుర్తి, సెప్టెంబర్ 21 : ప్రస్తుత పోటీ రాజకీయాల్లో వినూత్న పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల ప్రకటించిన సింగిల్ విండో సొసైటీ డైరెక్టర్ల నియామకంలో అన్న చెల్లెలను అదృష్టం వరించింది. వివరాల్లోకి వెళ్తే చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన ఉగిలే శ్రీనివాస్-లాండే సుజాత అన్నా చెల్లెలు కాగా కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన పార్టీ అధినాయకత్వం సొసైటీ డైరెక్టర్ల నియామక ప్రక్రియలో అవకాశాన్ని కల్పించింది. వీరిది ఓకే సొంత మండలం చందుర్తి కావడంతో పాటు ఒకేసారి అన్న చెల్లెలు సొసైటీ డైరెక్టర్లుగా ఎంపికవ్వడంతో కిష్టంపేట గ్రామంతో పాటు ఎన్గల్ గ్రామాల్లో పలువురు అభినందించారు.