పాపం పసివాడు
కాంక్రీట్ మిక్సర్ వాహన డ్రైవర్ అజాగ్రత్తతో ఓ బాలుడి ప్రాణం పోయింది. నిర్లక్ష్యంగా రివర్స్ చేయడంతో గోడకు తగలగా, దాని పక్కన కూర్చున్న బాలుడి తలపై గోడ పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
- గోడను ఢీకొన్న కాంక్రీట్ మిక్సర్ వాహనం
- గోడ కూలి బాలుడి మృతి
మేడిపల్లి, మార్చి 19 : కాంక్రీట్ మిక్సర్ వాహన డ్రైవర్ అజాగ్రత్తతో ఓ బాలుడి ప్రాణం పోయింది. నిర్లక్ష్యంగా రివర్స్ చేయడంతో గోడకు తగలగా, దాని పక్కన కూర్చున్న బాలుడి తలపై గోడ పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మేడపల్లి ఎస్ఐ శ్యామ్రాజ్ వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా వడ్డెరగూడెం గ్రామానికి చెందిన సంపంగి సంగీత, శ్రీను దంపతులకు కూతురు నిహారిక (7), కొడుకు గణేశ్ (4) ఉన్నారు. వీరు గత నెల రోజుల నుంచి కరీంనగర్లో కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి మేడిపల్లి మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న ఎన్నమనేని ప్రణవికి చెందిన పౌల్ట్రీ ఫామ్ పనులు చేస్తున్నారు. అదే ఫామ్లో పని చేస్తున్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన అమరగోని రాజు అజాక్స్ కాంక్రీట్ మిక్సర్ వాహనాన్ని అజాగ్రత్తగా రివర్స్ తీయడంతో అది గోడకు తగిలింది. దీంతో ఆ పక్కనే కూర్చున్న సంపంగి గణేశ్పై గోడ కూలడంతో తల నుజ్జునుైజ్జె అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లి సంగీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్యామ్రాజ్ తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

