Book launch | వెల్గటూర్, జూన్ 12 : మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కొప్పుల ఈశ్వర్ జీవిత చరిత్రను ఒక ప్రస్థానం అనే పేరుతో నూతి మల్లన్న రచన చేశారు. వెల్గటూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చల్లూరి రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ గని కార్మికునిగా తన జీవితాన్ని ప్రారంభించి ఆరుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసే నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాడన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్, ఉపాధ్యక్షులు గుండె జగదీశ్వర్, నాయకులు పెద్దూరి భరత్, కొప్పుల సురేష్, అనుమాల తిరుపతి, బందెల రాజయ్య, రంగు తిరుపతి గౌడ్, ఎర్రోళ్ల మహేష్, మీరు అశోక్, బాలసాని సత్యం, మోత్కూర్ శేఖర్, పల్లెర్ల సతీష్, పలువురు మహిళలు పాల్గొన్నారు.