కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 24: కరీంనగర్లోని జ్యోతిబాఫూలే పార్(సరస్ గ్రౌండ్)లో మార్చి 2 నుంచి 8వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పుస్తక ప్రదర్శన కార్యక్రమ ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఏడు రోజులు పాటు చర్చాగోష్ఠులు, మహిళా సాధికారత, బాలికా విద్య తదితర అంశాలపై కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
కవులు, రచయితలు సాహిత్య చర్చలు జరుపాలని సూచించారు. పుస్తక ప్రదర్శనలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొనేలా చూ డాలన్నారు. జిల్లాలో సాహిత్య రంగంలో కృషి చేసిన విశిష్ట వ్యక్తుల పేర్లతో జీవన సాఫల్య, ఇతర పురసారాలతో సాహితీవేత్తలను గౌరవించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఎస్సారార్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, మెప్మా పీడీ రవీందర్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మధుసూదన్, కలెక్టరేట్ ఏవో డాక్టర్ నారాయణ, డీడబ్ల్యూవో సబిత, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్, సాహితీవేత్తలు అన్నవరం దేవేందర్, గాజుల నాగభూషణం, నంది శ్రీనివాస్, లక్ష్మణరావు, వైరాగ్యం ప్రభాకర్, బసవేశ్వర్, మడిపెల్లి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.