NTPC recognition board elections | గోదావరిఖని : రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ అనూహ్యంగా విజయం సాధించింది. ఎన్టీపీసీ ఎన్నికల్లో ఎప్పుడైనా తమదే విజయం అంటూ విర్రవీగిన అధికార కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీకి ఈసారి చుక్కెదురైంది. గడిచిన ఆరు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఐఎన్టియూసికి ఈసారి ఉద్యోగులు షాక్ ఇచ్చారు. పెద్దగా ఓటు బ్యాంకు లేని బీఎంఎస్ యూనియన్ ఈసారి అన్యుహంగా విజయం సాధించింది. ఎన్నికల్లో బీఎంఎస్ కు 102 ఓట్ల లభించగా కాంగ్రెస్ ఐఎన్టియూసికి 94 ఓట్లు లభించాయి. సీఐటీయూకి 12 ఓట్లు మాత్రమే లభించాయి. ఎన్టీపీసీలో గతంలో ఉద్యోగగా పనిచేసి బీఎంఎస్ కు నాయకత్వం వహించిన వడ్డేపల్లి రామచందర్ ప్రస్తుతం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా కొనసాగుతుండడం ఈ ప్రాంతంపై ఆయనకు పూర్తిగా పట్టు ఉండడం ఎన్టీపీసీ ఎన్నికలను ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షించి గెలుపు సాధించే విధంగా ప్రయత్నాలు చేశాడు. ఎన్బీసీ మెంబర్ గా ఉన్న ఐఎన్టియూసి సీనియర్ నాయకుడు బాబర్ సలీం పాషా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకొని ముందుకు సాగాడు. ఒక దశలో ఎన్నికలు బాబర్ వర్సెస్ వడ్డే పెల్లిగానే సాగాయి. ఎట్టకేలకు 35 సంవత్సరాల తర్వాత బీఎంఎస్ రామగుండం ఎన్టీపీసీలో విజయకేతనం ఎగురవేసింది. రామగుండం ఎన్టీపీసీలో జూనియర్ కార్మికులుగా ఉన్న ఉద్యోగులు బీఎంఎస్ కు అనుకూలంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. కేవలం 8 ఓట్ల తేడాతో అధికార కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ పై బీఎంఎస్ విజయం సాధించినప్పటికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమైంది.