NTPC | జ్యోతినగర్, సెప్టెంబర్ 26: రామగుండం ఎన్టీపీసీలో జరిగిన వర్కుమేన్ ఉద్యోగుల గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎన్టీపీసీ కార్మిక సంఘ్(బీఎంఎస్) గెలుపు కేవలం ప్రథమ స్థానమేనని ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్, ఎన్టీపీసీ మజ్జూర్ యూనియన్(ఐఎన్టీయూసీ) సెక్రటరీ జనరల్ బాబర్ సలీంపాష పేర్కొన్నారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కార్మికులను దూర ప్రాంతాల నుంచి పలువురితో ఎన్నో రకాలుగా స్వేచ్చ లేకుండా ఉద్యోగ ఓటర్లను మభ్యపెట్టి కేవలం ప్రథమ స్థానం కోసం పాటుపడినట్లు తెలిపారు. ఈ గెలుపు ఘన విజయం కాదని, రెండోస్థానంగా ఎన్టీపీసీ మజ్జూర్ యూనియన్‌కు కూడ కార్మికులు ఓటు వేసి ఆదరించారన్నారు.
బీఎంఎస్ యూనియన్ గెలుపును సమర్థించిన వారు ఆత్మ విమర్శన చేసుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత గుర్తింపుగా కార్మికులు ఓటుతో అవకాశం కల్పించారని మజ్జూర్ యూనియన్ నుంచి అన్ని సమావేశాల్లో భాగస్వాములు కానున్నట్లు తెలిపారు. గత దశబ్దాల నుంచి అనేక పర్యాయాలుగా ఎన్టీపీసీ వ్యాప్తంగా ఎన్టీపీసీ మజ్జూర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన కోసం చేసిన కృషితోనే కార్మికులు ఓటుతో మజ్జూర్ యూనియన్‌కు పట్టం కట్టినట్లు ఆయన గుర్తుచేశారు. ఇప్పటికి ఎప్పటికి కూడ కార్మికుల సమస్యల పరిష్కారంపై మద్దూర్ యూనియన్ సహాకారం ఉంటుందన్నారు. ఇక్కడ ఎన్టీపీసీ మద్దూర్ యూనియన్ నాయకులు వేముల కృష్ణయ్య, ఆరెపల్లి రాజేశ్వర్, తదితర నాయకులు ఉన్నారు.