BMS formation Day | జగిత్యాల : సుతారి భవన నిర్మాణ కార్మికులంతా ఐక్యంగా ఉండాలని ఆ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మూలసపు రాజన్న పిలుపునిచ్చారు. భారత్ మజ్దూర్ సంఘ్ 70 వసంతాలు పూర్తిచేసుకుని 71 వ సంవత్సరంలో అడుగిడిన సందర్భాన్ని పురస్కరించుకొని సుతారి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
భారత్ మజ్దూర్ సంఘ్ వారోత్సవాల్లో భాగంగా గురువారం జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డు విద్యానగర్ సంఘ కార్యాలయంలో ఉదయం ఆయన బీఎంఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కార్డు సంఘ సభ్యులందరికీ అందించామని, ఇంకా లేబర్ కార్డు తీసుకోని కార్మికులు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు భారతపు శ్రీనివాస్, బండారి మల్లయ్య, గోలి గంగారాం, భారతపు రమేష్, దయ్యాల రాజేశం, గంగం లచ్చన్న, జిల్లాల రవీందర్, జిల్లాల పెద్దన్న, బొక్కల నర్సయ్య, చిట్ల శ్రీనివాస్, జిల్లాల ప్రభాకర్, బక్కశెట్టి రాజిరెడ్డి, వొడ్నాల రాజన్న, లచ్చం, బేతి రాజన్న, భారతపు రాజన్న, భారతపు గంగాధర్, బూసి రాకేష్, దయాల రాజo తదితరులు పాల్గొన్నారు.