అర్హుల ఓట్లు కాపాడాలి
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒకరూ భాగస్వాములు కావడమే కాకుండా, అర్హుల ఓట్లు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి నిర్వహించిన బీఎల్ఏల సమావేశంలో ఆయన అవగాహన కల్పించారు.
- సర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలి
- ఆధార్ అనుగుణంగా నమోదు చేయించాలి
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి
- సర్ ప్రక్రియపై బీఎల్ఏలకు అవగాహన
జగిత్యాల, జూలై 11 : ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒకరూ భాగస్వాములు కావడమే కాకుండా, అర్హుల ఓట్లు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి నిర్వహించిన బీఎల్ఏల సమావేశంలో ఆయన అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్ నమోదులో ఎదురొంటున్న సమస్యలు, పరిషారాలు, నమోదు ప్రక్రియ వివరించారు.
సర్ ప్రక్రియ వల్ల వచ్చిన ప్రజలను కలుసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తుందని, ఎస్ఐఆర్ నమోదు రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జిగా ఎమ్మెల్సీ రమణకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఆధార్ కార్డుకు అనుగుణంగా ఓటు నమోదు చేయాలని, ప్రతి ఒకరూ ఈ నెల 24లోగా సర్ ప్రక్రి య పూర్తి చేయాలని సూచించారు. అధికార పార్టీ తప్పులు చే యకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జగిత్యాల ము న్సిపాలిటీ అవినీతిమయమైందని, మున్సిపల్లో అవినీతిపై స భ్యులు దృష్టి సారించాలని తెలిపారు. కేటీఆర్ సూచనల మే రకు పార్టీ పరంగా బూత్ లెవెల్ ఏజెంట్ ప్రతి ఒకరినీ కలిసి సర్ నమోదులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ జీవన్‌రెడ్డితో కలిసి పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు జీవన్‌రెడ్డి అని, ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత ఉత్సాహంగా సమావేశాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. 2009లో జగిత్యాలలో 30 వేల నకిలీ ఓట్లు తొలగించి, దాదాపు 25 వేల ఓట్లు నమోదు చేయించామని గుర్తు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్ ఫారంలో వివరాలు పూర్తి చేసేందుకు సహకరించాలని సూచించారు.
జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియలో బీఎల్వోకు సహాయకారిగా ఒకరిని నియమించాలని, జగిత్యాలలో 27.8 శాతం మాత్రమే నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నారని తెలిపారు. కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులు ఎస్ఐఆర్పై మరింత అవగాహన కల్పించి, పారదర్శకంగా ప్రక్రియ కొనసాగించాలన్నారు. సమావేశంలో జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ వొద్ది హరిచరణ్‌రావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కోరుకంటి రాము, హరీశ్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BLAs
- BRS
- SIR Process
- T Jeevan Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

