జగిత్యాల అర్బన్/ జగిత్యాల రూరల్, ఆగస్టు 23 : దేశంలో రాజకీయ పునరేకీకరణకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను బ్లాక్మెయిల్ చేసేందుకే లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని జగిత్యాల ఎమ్మె ల్యే డా.సంజయ్‌కుమార్ మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల కోసం బీజేపీ కుట్రపన్నుతున్నదని ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ నివాసంలో కవితకు ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి రావడాన్ని ఖండించారు. తర్వాత జగిత్యాలకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
లిక్కర్ స్కాంలో తనకు సంబంధంలేదని, ఏ విచారణకైనా సిద్ధమని ఎమ్మెల్సీ కవిత ప్రకటించినప్పటికీ బీజేపీ నేత లు రాజకీయ లబ్ధి కోసం ఇంటిపై దాడికి దిగడం హేయమైన చర్య అన్నారు. కేంద్రంలో అధికారం చేతుల్లో ఉందని ఇష్టారీతిగా వ్యవహరించడం సరికాదన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ రూరల్ మండలాధ్యక్షుడు బాల ము కుందం, జగిత్యాల పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, ఏఎంసీ చైర్మన్ నక్కల రాధ, ప్యాక్స్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ కూసరి అనిల్, ఆర్టీఏ జిల్లా మెంబర్ సుధాకర్‌రావు, ఎఫ్‌సీఎస్ చైర్మన్ గుమ్ముల అంజయ్య, నాయకులు ఆనందరావు, వొల్లెం మల్లేశం, బాలె శంకర్, జంబర్తి శంకర్, నాగయ్య, మాజీ సర్పంచ్ చిర్ర నరేశ్, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ పాల్గొన్నారు.