Chirumalla Rakesh | కాల్వ శ్రీరాంపూర్, జూలై 12 : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్ జన్మదిన వేడుకలను కాల్వ శ్రీరాంపూర్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేడుదుల రాజు కుమార్, మండల శాఖ యూత్ అధ్యక్షుడు నూనేటి కుమార్, పెగడపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు కూకట్ల నవీన్, మండల శాఖ సోషల్ మీడియా కన్వీనర్ కిరణ్ గూడెపు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుంట శ్రీకాంత్ , తాత సాయి కిరణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.