యంగ్ డైనమిక్ లీడర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఊరూవాడా అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఎక్కడికక్కడ ఆలయాల్లో పూజలు చేశారు. రక్తదానాలు, అన్నదానాలు చేశారు. పలు చోట్ల మొక్కలు నాటి, గిఫ్ట్ ఏ స్మైల్ కింద సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల, జూలై 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్లలో నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, నాయకులతో కలిసి అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. జిల్లా దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 48మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఎన్ అనురాగ్‌రెడ్డి సహకారంతో ఆత్మహత్య చేసుకున్న కుడిక్యాల నాగరాజు, తడుక శ్రీనివాస్ కుటుంబాలకు తలా 25వేల విలువైన చెక్కును తెలంగాణ భవన్లో అందజేశారు.
అలాగే కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో వేడుకలకు మేయర్ యాదగిరి సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్ హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పలువురికి పూలు, పండ్ల మొకలను పంపిణీ చేశారు. రామగుండం ని యోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చం దర్ పాల్గొన్నారు. శ్రీధర్మశాస్త్న నిత్యఅన్నదాన వేదికలో అన్నదానం చేశారు.
ఆశ్రమంలో చద్దర్లు పంపిణీ చేశారు. గోదావరిఖనిలోని యూనియన్ కేంద్ర కార్యాలయంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి కేక్‌కట్ చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కౌశికహరి గోదావరిఖనిలోని అమ్మ పరివార్ ఆశ్రమంలో అనాథ పి ల్లల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ్రమం షెడ్డు రేకుల కోసం 20వేల ఆర్థిక సాయం అందించారు. పాలకుర్తి మండలం జయ్యారంలో బీఆర్ఎస్ నాయకుడు పోతరాజుల లింగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబానికి 10వేలు అందజేశారు.