MLA Vijayaramanarao | జూలపల్లి, జూన్ 23 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో వంతెన శిలాఫలకానికి వినూత్న రీతిలో మొదటి పుట్టినరోజు వేడుకలను మంగళవారం నిర్వహించి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. జూలపల్లిపెద్దాపూర్ గ్రామాల మధ్య హుస్సేన్ మియా వాగుపై కొత్త వంతెన నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసింది.
ఈ క్రమంలో గతేడాది మే 21న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. సంవత్సరకాలం గడిచినా ఇప్పటి దాకా పనులు మొదలు పెట్టకపోవడంతో బీజేపీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ తీశారు. రెండున్నరేండ్లు గడుస్తున్నా డబుల్ రోడ్డు పనులు పూర్తి చేయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తీగల అశోక్ గౌడ్, కంకణాల జ్యోతి బసు, సంకెండ్ల నర్సయ్య, గుమ్మడి శంకరయ్య, మల్లెత్తుల అంజి, కొల్లూరి స్వామి, నాగుల అన్వేష్, పెద్దోళ్ల ఐలయ్య, కల్లేపల్లి అంజి, నగునూరి లక్ష్మీనారాయణ, మేరుగు కనకయ్య, కంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.