రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలి
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు
వేములవాడ రూరల్, ఫిబ్రవరి 25 : దీర్ఘకాలిక ప్రణాళికలతో పంటలు సాగు చేయడం ద్వారా రైతులు మంచి లాభాలు పొందవచ్చని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. అచ్చనపల్లిలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి అంబేద్కర్ సంఘ భవనానికి భూమిపూజ చేశారు. నమిలిగుండుపల్లిలో ప్రభుత్వ పాఠశాల ప్రహరీకి భూమిపూజ చేశారు. వట్టెంలో రైతు వేదిక ప్రారంభించారు. ఫాజుల్‌నగర్‌లో మత్స్యకార భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాట్లాడుతూ, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. క్లస్టర్ పరిధిలోని రైతులందరూ సమన్వయం, పరస్పర సహకారంతో ముందుకెళ్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. రైతులందరూ సహకార ధోరణిని అవలంబిస్తూ మార్కెట్ వ్యవస్థను శాసించే స్థాయికి రావాలని ఆకాంక్షించారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చామని ఆయన గుర్తుచేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, ఎంపీపీ బండ మల్లేశం, జడ్పీటీసీ ఏశ వాణి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఏశ తిరుపతి, వేములవాడ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొస్కుల రవి, సర్పంచులు ఎల్లవ్వ, చంద్రిగిరి లక్ష్మి, యామ సుమతి, నాగుల వేణుగోపాల్, కట్కం మల్లేశం, సుమన్, ఎంపీటీసీ వేల్మ లస్మవ్వ, మాజీ సర్పంచ్ గుడిసే విష్ణు, బాల్‌రెడ్డి, దేవరాజు, చంద్రయ్య, అంజయ్య, రవీందర్‌రెడ్డి, తిరుపతితో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.