HomeKarimnagarBharatiya Janata Party Has Become An Obstacle To Financial Criminals
ఆర్థిక నేరగాళ్లకు అడ్డా బీజేపీ
‘భారతీయ జనతా పార్టీ ఆర్థిక నేరగాళ్లకు అడ్డగా మారింది. బ్యాం కుల నుంచి రుణాలు తీసుకొని మోసం చేసిన ఆ పార్టీ నాయకురాలు రాణిరుద్రమకు మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేసే అర్హత లేదు’ అని టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ మండిపడ్డారు.
ప్రజాధనాన్ని దోచుకొని ప్రజల గురించి మాట్లాడడం విడ్డూరం
బ్యాంకులను మోసం చేసిన రాణిరుద్రమకు కేటీఆర్‌ను విమర్శించే అర్హత లేదు
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 9: ‘భారతీయ జనతా పార్టీ ఆర్థిక నేరగాళ్లకు అడ్డగా మారింది. బ్యాం కుల నుంచి రుణాలు తీసుకొని మోసం చేసిన ఆ పార్టీ నాయకురాలు రాణిరుద్రమకు మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేసే అర్హత లేదు’ అని టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి కేటీఆర్‌పై తప్పుడు కూతలు కూస్తే సహించేది లేదని హెచ్చరించారు. గురువారం మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మోదీ హయాంలో రోజురోజు కూ ఆర్థిక నేరగాళ్లు పెట్రేగిపోతున్నారని ఆరోపించారు. స్విస్ బ్యాంకుల్లో దాచిన సొమ్ము తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మోదీ తన స్నేహితుడు అదానీకి ప్రజాధనాన్ని అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. అదానీపై వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం ప్రతిపక్షాలు జేపీసీ వేయాలని చేస్తున్న డిమాండ్‌కు ఎందుకు ఒప్పుకోవడంలేదో చెప్పాలని నిలదీశారు. మోదీ అండదండలతో 19లక్షల కోట్లు బ్యాంకు రుణాలు ఎగవేసిన వ్యక్తులు ద ర్జాగా విదేశాల్లో విలాసవంతమైన జీవనం గడుపుతున్నారన్నారు.
ఇప్పుడు ఇదేబాటలో ఇటీవల సిరిసిల్లకు వచ్చిన బీజేపీ నాయకురాలు రాణిరుద్రమ సైతం బ్యాంకులకు చెల్లించలేదని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును దో చుకున్న వారే ప్రజాసంక్షేమం గురించి మాట్లాడడం వి డ్డూరంగా ఉందన్నారు. జనంలో కనీస ఆదరణ లేని వాళ్లు కూడా ప్రజానేత గురించి విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ మాట్లాడుతూ, మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని కొనియాడారు. సాధారణ మహిళలు సమాఖ్య సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారని, కానీ ఇందుకు భిన్నంగా బీజేపీ నేత రాణిరుద్రమ బ్యాంకులోని ప్రజల సొమ్మును కాజేశారని విమర్శించారు. మంత్రి కేటీఆర్ కృషి తో సిరిసిల్ల పట్టణం సిరుల ఖిల్లాగా వర్ధ్దిల్లుతున్నదని అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వమే సిరిసిల్లలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అవార్డులను ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక మీదట బీజే పీ నేతలు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే స హించబోమని హెచ్చరించారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షుడు సత్తార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు బత్తుల వనజ, మున్సిపల్ కౌన్సిలర్ దిడ్డి మాధవి, టీఆర్ఎస్వీ నేత షేక్ సిఖిందర్ పాల్గొన్నారు.