Best Service Award | ఓదెల, ఆగస్టు 15 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎస్ఐకి పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయ రమణారావు చేతుల మీదగా పురస్కారాన్ని ప్రధానం చేశారు. ఎస్ఐగా రమేష్ పొత్కపల్లిలో పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విధి నిర్వహణలోనే కాకుండా అనేక సామాజిక సేవ కార్యక్రమాలను చేపడుతున్నారు.
విద్యార్థులకు, పేద ప్రజలకు అండగా ఉంటున్నారు. మండలంలో శాంతి భద్రతలకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తమ సేవా పురస్కారాన్ని అందించడం పట్ల పలువురు ఎస్సై రమేష్ ను అభినందించారు.