కమాన్చౌరస్తా, జూన్ 9: ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్-24 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో విజయభేరి మోగించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని వావిలాలపల్లిలో గల అల్ఫోర్స్ టైనిటాన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక ప్రణాళిక, అధ్యాపకుల అవిశ్రాంత పాఠ్యబోధన, విద్యార్థుల కృషితోనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయన్నారు. ప్రతి సంవత్సరం అల్ఫోర్స్ అందిస్తున్న శిక్షణ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీట్లు సాదించే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా ఆదివారం వెలువడ్డ ఐఐటీ అడ్వాన్స్డ్ ఫలితాల్లో వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు.
ఇందులో ఎం హర్షిత్ 64వ ర్యాంకు సాధించగా, జీ శ్రీహాస్ 290, బీ భరద్వాజ్ 396, ఆర్ పునీత్ మనోహర్ 477, సుబోద్ దరి 545, ఏ శివవరుణ్ 557, పీ రాహుల్ 571, దేవదత్త 751, విశాల్ రెడ్డి 838, డీ రిశ్వంత్ కుమార్ 1029, పీ మనోహర్ 1229, నిహాల్ 1379, ఆదిత్యవర్ధన్ రావు 1523, లహరి 1609, అరుణ్ కుమార్ 1658, బీ అభినవ్ సిదార్ధ రెడ్డి 1851, సత్య అమూల్య 1933 ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని మరింత పెంచారని చెప్పారు. అలాగే వెయ్యి లోపు తొమ్మిది మంది విద్యార్థులు, 2000 లోపు 17 మంది, 5000 లోపు 32 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వారిని అభినందించి సత్కరించారు.
నాకు ఆల్ ఇండియా 64 వ ర్యాంక్ రావడానికి సహకరించిన అల్ఫోర్స్ విద్యాసంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు. నరేందర్ రెడ్డి సార్ ప్రతి సారి మాకు ఇచ్చే శిక్షణ, మాక్ పరీక్షల విషయంలో ప్రతి సారి అధ్యాపకులను ప్రోత్సహిస్తూ, పరిశీలించారు. పరీక్షలు రాసే సమయంలో కూడా ఎక్కడ మార్కులు తగ్గుతున్నాయి..? ఏ ప్రశ్నలు ఎలా గుర్తించాలనే..? విషయంపై చాలా అవగాహన కల్పించారు. అందరి ప్రోత్సాహంతోనే నాకు మంచి ర్యాంకు వచ్చింది.
– హర్షిత్, 64వ ర్యాంకు, అల్ఫోర్స్