CP Amber Kishore Jha | పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి.. రామగుండం సీపీ అంబర్ కిషోర్ఝా
బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని రామగుండము పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు.
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
CP Amber Kishore Jha | సుల్తానాబాద్ రూరల్, మే 15 : బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని రామగుండము పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలోని దుబ్బపల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ను రామగుండము పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. వివరాలు నమోదు రిజిస్టర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ చెక్ పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రత చర్యలను పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ప్రతీ వాహనం, పశువుల వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలనీ, సంబంధిత పత్రాలు పరిశీలించాలని ఆదేశించారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రివేళలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీపీ వెంట పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ రంజిత్, సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

