BC bandh | చిగురుమామిడి, అక్టోబర్ 18: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ జేఏసీ బంద్ ఇచ్చిన పిలుపుమేరకు మండలంలోని బిఆర్ఎస్, సిపిఐ, ధర్మ సమాజ్ పార్టీ సంఘీభావం ప్రకటించాయి. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద అఖిలపక్ష పార్టీలు శనివారం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావలసిన రిజర్వేషన్లు కల్పించాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేయించారు. బందుకు పూర్తిగా సహకరించాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు మామిడి అంజయ్య, పెనుకుల తిరుపతి, బెజ్జంకి రాంబాబు, తే రాల సత్యనారాయణ, గూడెం లక్ష్మి, రమేష్, శ్రీనివాస్, నారాయణ, తాళ్ల నరేష్, ఆర్కే చారి, సదానందం, సర్వర్ పాషా, తిరుపతి, శంకరయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. బిజెపి, కాంగ్రెస్ వేరువేరుగా బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలాగే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..
బీసీ జేఏసీ బంధు పిలుపులో భాగంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బంధు కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గీకురు రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.