భక్తి విశ్వాసాలు, త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను సోమవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. ప్రధానంగా రేకుర్తిలోని సాలేహ్నగర్, కళాభారతి వద్ద, బైపాస్ రోడ్, చింతకుంటలో గల ఈద్గాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా మత్త పెద్దలు సందేశాలు ఇచ్చారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
– కమాన్చౌరస్తా, జూన్ 17