అయోధ్య రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠన వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ అద్భుతాన్ని ఆవిష్కరించారు.
రెండు గుమ్మడి కాయలు, అర కిలో క్యారెట్లతో 12 అంగులాల ఎత్తు, 16 అంగులాల పొడవుతో నాలుగు గంటలు శ్రమించి ఆదివారం రామమందిరాన్ని నిర్మించారు. అనిల్ గతంలో పుచ్చకాయపై కేసీఆర్, కేటీఆర్, రైతుబంధుపై చిత్రపటాలు, శివుడి ప్రతిమలకు చెక్కి ఆశ్చర్యపరిచారు.
– ఎల్లారెడ్డిపేట, జనవరి 21