శంకరపట్నం, డిసెంబర్ 9 : ఆరుతడి పంటలు సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటాయని మండల వ్యవసాయాధికారి ఆర్ శ్రీనివాస్, ఆత్మ బీటీఎం సునీల్ బాబు పేర్కొన్నారు. మండలంలోని లింగాపూర్, కొత్తగట్టు గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరికి బదులుగా ఇతర పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యాసంగిలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లు నిర్వహించదని తెలిపారు. రైతులు వరి పంట వేయవద్దన్నారు. వరికి బదులుగా ఇతర పంటలను పండించాలని కోరారు. పెసర, మినుము, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయలు మొదలగు ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్తగట్టు గ్రామంలో రైతులు సాగు చేస్తున్న వేరుశనగ పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆరుతడి పంటలపై బ్రోచర్లను విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఏఈవో సుమాంజలి, ఆర్ఎస్ఎస్ సభ్యుడు తీగల రమేశ్ పాల్గొన్నారు.
ఇతర పంటలు సాగు చేయాలి
యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయాధికారి రంజిత్ కుమా ర్ రైతులకు సూచించారు. మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరుతడి పంట లు వేరుశనగ, మినుములు, పొద్దుతిరుగుడు, నువ్వులు జొన్న, కూరగాయల పంటలు సాగు చేయాలని కోరారు. పంట మార్పిడితో భూసారం పెరగడంతోపాటు రైతులకు ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఇతర పంటలతో అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు బొల్లం సౌజన్య, పరీద్, శ్రీనివాస్, సాయి కుమార్, గణేశ్, వంశీధర్ రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.
అందుబాటులో అన్ని రకాల విత్తనాలు
అన్ని రకా ల విత్తనాలు అందుబాటులో ఉంచుతామని రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయధికారి శ్రీధర్ తెలిపారు. మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో పర్యటించారు. పలువురి రైతుల పంటల పొలాలను పరిశీలించి, మాట్లాడారు. రైతులు వరికి బ దులుగా ఇతర పంటలనే వేసుకోవాలన్నారు. యాసంగిలో వరికి బదులు మినుము, పెసర, పల్లికాయ, కూరగాయలు వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. సంక్రాంతి తర్వాత నువ్వులు సాగు చేసుకోవాలన్నారు. ఏడీఏ శ్రీనివాస్, ఏవో సురేందర్, సర్పంచ్ అంజయ్య, ఏఈవో రఘు పాల్గొన్నారు.